పదకొండు రోజులపాటు భక్తిశ్రద్దలతో మాజలందుకొన్న గణనాథుల నిమజ్జనోత్సవం కనుల పండుగగా ముగిసింది. రాష్ట్రంలో సుమారు రెండు లక్షల విగ్రహాలు ఏర్పాటుచేసినట్టు సమాచారం. విగ్రహాలు కూర్చోపెట్టిన రోజు నుండి మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు రోజులలో లో నిమజనాలు జరిగాయి. ఏడవరోజు ఆదివారం కావడంతో ఆరోజు కూడా నిమజ్జనాలు ఊపందుకున్నాయి. దక్షిణాదిలో గణేశ్ ఉత్సవాలకు ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్లో పదకొండో రోజు ఎక్కడచూసినా ఆధ్యాత్మికశోభ ఉ ట్టిపడింది. డప్పుల దరువు మధ్య తీన్మార్ డ్యాన్సులతో గణేశుడికి వీడ్కోలు పలికారు.
హైదరాబాద్ మహానగరంలో గణపతుల నిమజ్జనోత్సవం లక్షల మంది భక్తజన సందోహం నడువ శోభాయమానంగా కొనసాగింది. ప్రత్యే క అలంకరణ, వివిధ రకాల ఆకారాల్లో కొలువుదీరిన గణపతులను చూసేందుకు కొలువుదీరిన గణపతులను చూసేందుకు భక్తులు ఆసక్తి ప్రదర్శించారు. ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 నమూనాతో తయారుచేసిన విగ్రహం అందర్నీ ఆకర్షించింది. దారిపొడవునా స్వచ్ఛందసంస్థలు వేదికలు ఏర్పాటుచేసి అల్పాహారం, నీళ్లు సమకూర్చాయి. జలమండలి 115 ప్రాంతాల్లో తాగునీటి శిబిరాలను ఏర్పాటుచేసి దాదాపు 30 లక్షల నీటి ప్యాకెట్లను పంపిణీచేసింది. 61 అడుగుల ఎత్తయిన ఖైరతాబాద్ ద్వాదశాదిత్య మహాగణపతిని నిమజ్జనానికి తరలించే ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహం నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చినభక్తులతో హుస్సేన్ సాగర్ నలువైపులా ప్రాంతాలన్నీ కికిరిసిపోయాయి. జర్మనీ, యూఎస్, యూఏఈకి చెందిన విదేశీయులు కూడా నిమజ్జనాన్ని తిలకించారు. పోలీస్ శాఖ చేపట్టిన పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు, ముందస్తు వ్యూహాలతో నిమజ్జనం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 35 వేల మంది • సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన తనం: కమాండ్ కంట్రోల్ సెంటర్తో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని వినాయక నిమజ్జనాల వద్ద నెలకొల్పిన సీసీ కెమెరాలను అనుసంధానించారు. దీనివల్ల నిమజ్జనం వీలైనంత త్వరగా, ప్రశాంతంగా ముగియడానికి మార్గం సుగమమైంది.